గత 16 రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం తగ్గాయి. హమ్మయ్య.. తగ్గాయా.. అన్ని అప్పుడే సంతోషపడకండి. ఎందుకంటే ఈ సంతోషం ఎక్కువసేపు ఉండదు. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను ఒక పైసా తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించాయి ఇందన సంస్థలు. అయితే, రూపాయాల్లో ధరలు పెంచే ఈ సంస్థలు, తగ్గించేది మాత్రం ఒక్క పైసానా అని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ మాత్రానికి తగ్గించడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.