సూర్యుడిపై అంతుచిక్కని పేలుడు మార్స్ పై అందమైన కిరణాలు...

సూర్యుడిపై అంతుచిక్కని పేలుడు జరగడంతో అల్ట్రావైలెట్ కిరణాలు ఎరుపు గ్రహమైన మార్స్ ( అంగారకుడు)పై అందంగా ప్రతిబింబించాయి.

Update: 2023-09-01 14:18 GMT

సూర్యుడిపై అంతుచిక్కని పేలుడు

మార్స్ పై అందమైన కిరణాలు...

సూర్యుడిపై అంతుచిక్కని పేలుడు జరగడంతో అల్ట్రావైలెట్ కిరణాలు ఎరుపు గ్రహమైన మార్స్ ( అంగారకుడు)పై అందంగా ప్రతిబింబించాయి. త్వరలో ఆశకలం మార్స్ ను ఢీ కొట్టనుందని ఖగోళ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఆగస్టు 26న భూకక్ష్యలోని ఉపగ్రహాలు ఈ ఫోటోలను తీశాయి. సూర్యుడిపై జరిగిన పేలుడును ఎం- క్లాస్ సోలార్ ఫ్లేర్ గా చెబుతున్నారు. అంటే ఈ పేలుడులో రెండవ శక్తివంతమైనదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుడు తాలూక కిరణాల పరావర్తనం చెంది సెప్టెంబరు 1న మార్స్ పై పడటాన్ని వారు గుర్తించారు.

అయితే ఈ పేలుడు, సూర్యుడిపై ఎక్కడ, ఎందుకు సంభవించిందన్న విశయంపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. పేలుడు జరిగిన తర్వాత అందులోని వాయువులన్నీ మండి సూర్యుని ఉపరితలంపై నల్లని ,అయస్కాంత క్షేత్రాలు ఏర్పడలేదని వారు గుర్తించారు.

కొన్ని సందర్భాల్లో కరోనల్ మాస్ ఇజెక్షన్ (CMEs) ద్వారా ఈ పేలుళ్లు సంభవిస్తాయన్నారు. అంటే సూర్యుడు మరికొన్ని నక్షత్రాల నుంచి అరుదైన వాయువులు వెలువడతాయి. అవి సూర్యుడు లేదా నక్షత్రాల శకలాలను బలవంతంగా నెట్టడంతో ఈ పేలుళ్లు జరిగే అవకాశం ఉంటుందన్నారు. కరోన అంటే ప్రత్యేకమైన ఆకారం లేకుండా ఆయా గ్రహాల ఉపరితలంపై ముత్యంలా మెరిసి మిగతా భాగం అంతా చీకటిగా ఉంటుంది. వీటిని మనం సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో చూస్తాం. ఇలాంటిదే మార్స్ చుట్టూ ఆరోరాగా ఏర్పడింది.

భూమిపై ఏర్పడితే ఏం జరుగుతుంది ?

అలాగే భూమిపై ఆరోరా ఏర్పడినప్పుడు సౌరతుఫాన్ లేదా సౌర వాయువులతో బలమైన గాలులు వీస్తాయి. దీంతో విపరీతమైన వెలుగును చిమ్మే మాలిక్యూల్స్ (కణాలు) వెలువడతాయి. అయితే ఇవన్నీ భూమి అయస్కాంత శక్తి తక్కువైనప్పుడే సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags:    

Similar News