అగ్రిగోల్డ్ కేసులో ఈడీ

అగ్రి గోల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.. ఈ కేసుకు సంబంధించి చైర్మన్ తో పాటు ముగ్గురు డైరెక్టర్లు అరెస్టు చేసింది.. ఇప్పటికే అగ్రిగోల్డ్ పైన [more]

Update: 2020-12-23 02:07 GMT

అగ్రి గోల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.. ఈ కేసుకు సంబంధించి చైర్మన్ తో పాటు ముగ్గురు డైరెక్టర్లు అరెస్టు చేసింది.. ఇప్పటికే అగ్రిగోల్డ్ పైన మనీలాండరింగ్ హవాలా కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఇద్దరిని అరెస్టు చేయడంతో ఈ కేసులో కీలక మలుపు తిరగనుంది. అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల దగ్గరనుంచి దాదాపు ఆరు వేల 400 కోట్ల రూపాయల పైచిలుకు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని వివిధ ప్రాజెక్టులు కోసం తరలించారు. డిపాజిట్ల రూపంలో సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా కుచ్చు టోపీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ అగ్రిగోల్డ్ పైన కేసు విచారణ చేపట్టింది. మరోవైపు ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ఈ తరుణంలోనే మనీలాండరింగ్ హవాలా జరిగిందని ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. తాజాగా అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకట రామారావు తో పాటు ముగ్గురు డైరెక్టర్లు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News