ఏపీలో రెండ్రోజులు సంతాప దినాలు.. ఎల్లుండి నెల్లూరులో మంత్రి అంత్యక్రియలు

సీఎం జగన్ మోహన్ రెడ్డి గౌతమ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు..

Update: 2022-02-21 06:31 GMT

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండురోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రస్తుతం మంత్రి భౌతిక కాయం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలోనే ఉంది. ఆయన భౌతిక దేహానికి embalming ప్రక్రియ పూర్తైన అనంతరం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి గౌతమ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. మరికొద్దిసేపటిలో హైదరాబాద్ కు చేరుకుని, అపోలో ఆస్పత్రిలోనే నివాళులు అర్పించనున్నారు. గౌతమ్ రెడ్డి కుమారుడు చదువు నిమిత్తం అమెరికాలో ఉంటున్నాడు. అతను వచ్చాకే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉండటంతో.. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఆలస్యమవ్వనున్నాయి. ఈ రోజు రాత్రి గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరు జిల్లా బ్రాహ్మణ పల్లికి తరలించి, అభిమానుల సందర్శనార్థం రేపంతా అక్కడే ఉంచనున్నారు. ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.



Tags:    

Similar News