Tue Jan 20 2026 11:23:53 GMT+0000 (Coordinated Universal Time)
మేకపాటి కుటుంబానికి విజయమ్మ, షర్మిల పరామర్శ..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించి విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Also Read : మంత్రి మేకపాటి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
గౌతమ్ రెడ్డి తల్లి, భార్యను పరామర్శించి.. కన్నీటి పర్యంతమయ్యారు. మేకపాటి గౌతమ్ మృతి కేవలం వారి కుటుంబానికే కాదు.. వైఎస్ కుటుంబానికి కూడా తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు. కాగా.. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోటస్ పాండ్ లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ జరగాల్సి ఉంది. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆ ప్రెస్ మీట్ వాయిదా పడింది.
Next Story

