ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు

ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి ప్రమాదాలు చేస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే సంబంధిత డ్రైవర్ తోపాటుగా వాహన యజమానుల [more]

Update: 2021-03-25 01:48 GMT

ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి ప్రమాదాలు చేస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే సంబంధిత డ్రైవర్ తోపాటుగా వాహన యజమానుల పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కొత్త చట్టం లో మార్పులకు అనుగుణంగా ఈ తరహా కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న ప్రమాదాలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం మొయినాబాద్ ప్రాంతంలో ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకలి వెంకటేష్ తాగిన మైకంలో ఆటో నడిపాడు. దీంతో అత్యంత వేగంగా ఆటో నడపడం వల్ల అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక అక్కడికక్కడే చనిపోయింది. మద్యం మత్తులో ఆటో నడిపినందుకు చాకలి వెంకటేష్ పైన హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే మాదిరిగా ఆటో యజమాని పైన కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News