కరోనా విజృంభిస్తున్నా నేటి నుంచి ఏపీలో?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసులు 420 కి చేరుకున్నాయి. వీటిలో 401 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని [more]

Update: 2020-04-13 02:24 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసులు 420 కి చేరుకున్నాయి. వీటిలో 401 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ 12 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏడుగురు ఇప్పటి వరకూ ఏపీలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో ఏపీలో ప్రతి ఒక్కరికి మూడు మాస్క్ లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీంతో పాటు నేటి నుంచి గ్రామాల్లో పంట కొనుగోలును ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామస్థాయిలో మొత్తం 786 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు నుంచి మొక్కజొన్న, శనగలు, కంది, పసుపు పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

Tags:    

Similar News