ఆ నలభై మందికి ఎలా? అధికారుల మల్లగుల్లాలు

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా వ్యాప్తి చెందుతోంది. ఏపీలో కరోనా మూడో దశకు చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా వ్యాధి సోకిన దాదాపు 40 మందికి వైరస్ [more]

Update: 2020-04-21 04:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా వ్యాప్తి చెందుతోంది. ఏపీలో కరోనా మూడో దశకు చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా వ్యాధి సోకిన దాదాపు 40 మందికి వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదు. ఈ నలభై మందికి వైరస్ ఎలా సోకిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరు గత కొంతకాలంగా ఎవరెవరిని కలిశారు? ఎక్కడికి వెళ్లారు? తదితర విషయాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఈ నలభై మందికి ఎలా వైరస్ సోకిందో తెలిస్తే గాని కరోనా వ్యాప్తిని ఆపడం సాధ్యం కాదన్నది అధికారుల భావన. పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News