చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

హైదరాబాదులో మరొకసారి చెడ్డీగ్యాంగ్ హంగామా చేసింది. రెండు ఇళ్లలో దోపిడీకి పాల్పడింది . అడ్డొచ్చిన వారిని పైన దాడి చేసి బంగారం ఎత్తుకొని పోయింది . నెలరోజుల [more]

Update: 2019-11-22 04:39 GMT

హైదరాబాదులో మరొకసారి చెడ్డీగ్యాంగ్ హంగామా చేసింది. రెండు ఇళ్లలో దోపిడీకి పాల్పడింది . అడ్డొచ్చిన వారిని పైన దాడి చేసి బంగారం ఎత్తుకొని పోయింది . నెలరోజుల పరిధిలో రెండుసార్లు చెడ్డి గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడటం పై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . గత నెలలో జరిగిన చెడ్డి గ్యాంగ్ దోపిడీ కేసును ఛేదించక ముందే మరొకసారి చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోవడం పై పోలీసులు సైతం సీరియస్ గా ఉన్నారు . . ఏకంగా రెండు ఇళ్లలో దోపిడీకి పాల్పడింది . ఒక వృద్ధురాలిపై దాడి చేసి మంగళసూత్రం తీసుకొని వెళ్లారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంట్లురు గ్రామంలో మళ్లీ చెడ్డి గ్యాంగ్ అలజడి చేసింది. వరుసగా రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడింది. 70 వేల నగదు,15 తులాల బంగారు ఆభరణాలు, మరో ఇంట్లో 4.5 తులాల బంగారం దోపిడీ చేశారు.

Tags:    

Similar News