మీరు ఎప్పటికీ ఇంతేనా

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధ్వంసక చర్యల వల్ల పోలవరం ఆగిపోయిందని ఆరోపించారు. టెండర్‌ షెడ్యూల్‌లో [more]

Update: 2019-09-20 08:35 GMT

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధ్వంసక చర్యల వల్ల పోలవరం ఆగిపోయిందని ఆరోపించారు. టెండర్‌ షెడ్యూల్‌లో ఎందుకు మార్పులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల కల అని గుర్తుచేశారు. ఒకరిని దృష్టిలో పెట్టుకుని రీ టెండరింగ్ ప్రక్రియ చేపట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ఆపేశారని మండిపడ్డారు.

ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త…..

కేంద్రం చెప్పినా, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకు పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. గోదావరిలో బోటు మునిగిపోతే ఇంత వరకూ కనిపెట్టలేని వాళ్లు పోలవరం రీటెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం కూడా పెరుగుతుందని నిపుణులు తేల్చారన్నారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News