జగన్ కు ఆ ప్రాంతంపై అంత ద్వేషం?
మొన్నటి వరకూ అమరావతిలో ఒకే సామాజిక వర్గం లబ్దిపొందిందని ప్రచారం చేసి నేడు డబ్బులు లేవని కొత్త నాటకానికి తెరతీశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. [more]
మొన్నటి వరకూ అమరావతిలో ఒకే సామాజిక వర్గం లబ్దిపొందిందని ప్రచారం చేసి నేడు డబ్బులు లేవని కొత్త నాటకానికి తెరతీశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. [more]
మొన్నటి వరకూ అమరావతిలో ఒకే సామాజిక వర్గం లబ్దిపొందిందని ప్రచారం చేసి నేడు డబ్బులు లేవని కొత్త నాటకానికి తెరతీశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. మూడు రాజధానులు అనేది ఒక పిచ్చి ఆలోచన అని చంద్రబాబు అన్నారు. రైతులపై తప్పుడు కేసులు పెడతారా? అని నిలదీశారు. అమరావతిలో రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆదాయం తెచ్చి పెట్టేది అమరావతి మాత్రమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిని చంపేసి డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి అని అన్నారు. తొలుత ఈ ప్రభుత్వం డబ్బులు సంపాదించడమెలా? అన్నది నేర్చుకోవాలన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలన్నారు.
మూూడు రాజధానుల ప్రతపాదన పిచ్చిది….
విశాఖపట్నంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు సిద్ధమవుతారా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. విశాఖలో ఎయిర్ పోర్టు కు రెండు వేల ఎకరాలు సమీకరిస్తే కోర్టుకు వెళ్లింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రాజధానిని మార్చే అధికారం మీకు ఎక్కడదని అని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి అక్టోపస్ భద్రత మధ్య బయటకు రావాల్సి వస్తుందన్నారు. సంపద సృష్టిస్తే ఆదాయం దానంతట అదే వస్తుందన్నారు. రాజధానిపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు పెట్టకుండా అమరావతిని నిర్మిద్దామనుకున్నానని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ అనేది విన్నూత్న ఆలోచన అని చెప్పారు. సెంటిమెంట్, పరువు, ప్రతిష్టలు మనకు లేవా? అని ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ ఉన్నాయన్నారు. అమరావతి ప్రజా రాజధాని అని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో 9వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదిక ముందే అసెంబ్లీలో ఎందుకు చెప్పారన్నారు. ఎందుకు ఈ ప్రాంతంపై ద్వేషమని ఆయన ప్రశ్నించారు. అమరావతికి చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. రాజకీయ కక్ష కోసం అమరావతిని చంపేస్తారా? అని నిలదీశారు. ఎందుకు హైపవర్ కమిటీ ఎందుకన్నారు. రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుందన్నారు. పాపాలు చేయడానికి విశాఖపట్నంపై కన్ను పడిందన్నారు.