Delhi : ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు కొనసాగుతున్నాయి

Update: 2026-01-17 04:12 GMT

దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం ఢిల్లీ పెద్ద ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ముందు వెళ్లేవారు కూడా కనిపించడం లేదుక. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు ఆలస్యం ఏర్పడింది. పొగమంచు పరిస్థితుల వల్ల విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్లతో నిర్ధారించుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

ఉష్ణోగ్రతలో స్వల్ప పెరుగుదల...
భారత వాతావరణ శాఖ ప్రకారం, శనివారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం ఇది 4 డిగ్రీలుగా ఉంది. స్వల్పంగా ఉష్ణోగ్రత పెరిగినా, ఉదయం వేళల్లో దృశ్యమానత తక్కువగానే కొనసాగింది. దీంతో రహదారి, రైలు, విమాన రాకపోకలు ప్రభావితమయ్యాయి. ఇదిలా ఉండగా, ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం, ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 368గా నమోదైంది. ఇది ‘అత్యంత దారుణం’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు తెలిపారు.
జీఆర్‌ఏపీ స్టేజ్–3 అమలు...
ఇటీవల, ఎన్‌సీఆర్‌ సహా పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత పరిస్థితిపై సమీక్షకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ఆధ్వర్యంలోని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ సమావేశమైంది. ప్రస్తుత వాయు నాణ్యత స్థాయిలు, వాతావరణ అంచనాలు, వాతావరణ పరిస్థితులను సమీక్షించిన ఉపసమితి, ఢిల్లీలో ఏక్యూఐ క్రమంగా పెరుగుతోందని గమనించింది. ఐఎం అంచనాల ప్రకారం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నెమ్మదిగా మారుతున్న గాలివేగాల కారణంగా రాబోయే రోజుల్లో వాయు నాణ్యత మరింత క్షీణించి ‘తీవ్ర’ స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, వాయు నాణ్యత మరింత దిగజారకుండా ముందస్తు చర్యగా, జీఆర్‌ఏపీ స్టేజ్–3 కింద ఉన్న అన్ని చర్యలను ఎన్‌సీఆర్‌ మొత్తం ప్రాంతంలో తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News