వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుంది

జగన్ ప్రకటనను బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గతంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు [more]

Update: 2019-12-18 07:00 GMT

జగన్ ప్రకటనను బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గతంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. ఇప్పుడు ఆ కమిటీ సిఫార్సుల మేరకు జగన్ ఆలోచనలు ఉన్నట్లు తమకు అర్థమవుతుందన్నారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. హైకోర్టు ఏ రాష్ట్రంలో రాజధానిలో లేదని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. సీఎం జగన్ ప్రకటనతో రాజధానిపై క్లారిటీ వచ్చిందన్నారు. అమరావతిని కేవలం లెజిస్లేచర్ కాపిటల్ కు మాత్రమే పరిచయం చేయకుండా మరింత అభివృద్ధి చేయాలని కోరారు.

అసెంబ్లీ సమావేశాలకే….

అమరావతిని కేవలం అసెంబ్లీ సమావేశాలకే పరిమితం చేయవద్దన్నారు. రాజధానిపై రాజకీయ, సామాజిక కోణంలో చూడకూడదన్నారు. ఎక్కడ రాజధాని ఉన్నా రోడ్డు, రైలు కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వికేంద్రీకరణను తాను సమర్థిస్తున్నానని జీవీఎల్ తెలిపారు. సీమలో హైకోర్టు ఏర్పాటు డిమాండ్ బీజేపీ చేస్తుందేనన్నారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని జీవీఎల్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదన్నారు. జగన్ నిర్ణయం సబబుగానే ఉన్నా మూడు రాజధానులు అనడమే బాగా లేదన్నారు. హైదరాబాద్ లో చేసిన తప్పును నవ్యాంధ్ర ప్రదేశ్ లో జరగకూడదని జీవీఎల్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రయత్నిస్తే మంచిదేనన్నారు.

Tags:    

Similar News