భరత్ అనే నేను సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు భరత్ రామ్ గా మార్చేందుకు మంత్రి కేటీఆర్ డబ్బులిచ్చారని తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అందుకే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. సినిమాలో సీఎంగా ఉండే హీరో పేరులో రామ్ అనే తన పేరు కలిసేందుకు ఇలా చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్ యాంకరింగ్ చేసుకోవాల్సిందేనని జోస్యం చేప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి బీజేపీపై కూడా నిప్పులు చెరిగారు. వాజ్ పేయి, అద్వానీ నేతృత్వంలోని ఒకప్పటి బీజేపీకి, ఇప్పటి బీజేపీకి చాలా తేడా ఉందన్నారు. మోడీ, షా బీజేపీని చెరబట్టారన్నారు. కర్ణాటకలో మెజారిటీ ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ను కాదని ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అక్రమ పద్ధతుల్లో ప్రయత్నిస్తుందన్నారు.