ఎవరీ భాస్కరనాయుడు?

ఏపీ శాసనసభలో భాస్కర నాయుడు పేరును ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం పై చర్చ జరిగే సందర్భంలో జగన్ భాస్కరనాయుడు [more]

Update: 2019-12-17 05:05 GMT

ఏపీ శాసనసభలో భాస్కర నాయుడు పేరును ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం పై చర్చ జరిగే సందర్భంలో జగన్ భాస్కరనాయుడు ప్రస్తావన తెచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని కాంట్రాక్టులను భాస్కర నాయుడుకు ఇచ్చారన్నారు. భాస్కరనాయుడు చంద్రబాబు బంధువు అని జగన్ ఆరోపించారు. దేవాలయాల్లో క్లీనింగ్ చేసే పనుల దగ్గర నుంచి అన్ని పనులనూ భాస్కర నాయుడుకే ఇచ్చారన్నారు. చంద్రబాబు బంధువులకే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టులు ఇచ్చారన్నారు జగన్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకతతో పనిచేస్తున్నామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లోనూ యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పిస్తున్నామన్నారు. సభలో టీడీపీ పచ్చి అబద్ధాలు చెబుతుందన్న జగన్, దీనిపై కూడా ప్రివిలేజ్ మోషన్ ఇస్తే సబబుగా ఉంటుందన్నారు.

Tags:    

Similar News