మోడీతో జగన్ భేటీ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 15న ప్రారంభమయ్యే [more]

Update: 2019-10-05 11:41 GMT

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోడీని పాల్గొనాల్సిందిగా జగన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వెనుకబడిన జిల్లాకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని ఈ భేటీలో ప్రధానిని కోరనున్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్‌ వివరిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధాని మెడీతో ఏపీ సీఎం జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం.

 

 

Tags:    

Similar News

.