జగన్ సెక్యూరిటీలో…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెక్యూరిటీ ని మరింత టైట్ చేశారు. కొత్తగా జగన్ భద్రత కోసం మొదటి సారి అక్టోపస్ సిబ్బందిని వినియోగించబోతున్నారు. . ముఖ్యమంత్రి [more]

Update: 2019-12-19 01:41 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెక్యూరిటీ ని మరింత టైట్ చేశారు. కొత్తగా జగన్ భద్రత కోసం మొదటి సారి అక్టోపస్ సిబ్బందిని వినియోగించబోతున్నారు. . ముఖ్యమంత్రి భద్రత కొరకు వీరు పని చేస్తారు. సీఎం జగన్ తో పాటుగా వీరు వుంటారని అధికారులు తెలిపారు. మూడు షిఫ్టుల్లో ఆరుగురు చొప్పున అక్టోపస్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారని అధికారుల నుంచి సమాచారం. దీనికి సంబంధించిన సమాచారం, కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. ముఖ్యంగా ఆక్టోపస్ సిబ్బంది పట్టణాల్లో ఉండే ఉగ్రవాదం పైన ప్రధానంగా పనిచేస్తుంటారు. పట్టణాల్లో ఏదైనా ఉగ్ర దాడులు జరిగిన నేపధ్యంలో వాటిని ఎలా ఎదుర్కొవాలో ఆక్టోపస్ సిబ్బంది వర్కవుట్ చేస్తుంది. మొదటిసారి ముఖ్యమంత్రి భద్రత కోసం ఆక్టోపస్ సిబ్బందిని నియమించారు. గతంలో ఎన్నడూ ఆక్టోపస్ సిబ్బందిని ముఖ్యమంత్రి , ప్రముఖుల భద్రత కోసం వినియోగించి లేదు. కానీ మొదటిసారి జగన్ భద్రత కోసం ఆక్టోపస్ సిబ్బందిని వాడుతున్నారు. ఇప్పటికే డ్యూటీలో చేరిన కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి.

Tags:    

Similar News