క్యాపిటల్ ప్రకటించి తొలిసారి జగన్?
విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత తొలిసారి వైఎస్ జగన్ విశాఖకు రాబోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈనెల 28న జగన్ విశాఖ పర్యటన [more]
విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత తొలిసారి వైఎస్ జగన్ విశాఖకు రాబోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈనెల 28న జగన్ విశాఖ పర్యటన [more]
విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత తొలిసారి వైఎస్ జగన్ విశాఖకు రాబోతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈనెల 28న జగన్ విశాఖ పర్యటన ఉంటుందన్నారు. విశాఖ రాజధానిగా ప్రకటించినందుకు 24 కిలోమీటర్ల మేర మానవహారం ఏర్పడి జగన్ కు స్వాగతం పలుకుతామన్నారు. దాదాపు మూడు గంటల పాటు మానవహారం కొనసాగుతుందని చెప్పపారు. 1290 కోట్ల అభివృద్ధి పనులకు జగన్ విశాఖలో శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. జగన్ కు చరిత్రలో నిలిచిపోయేలా స్వాగతం చెబుతామన్నారు. జగన్ విశాఖ పర్యటనపై అధికారులతో సమీక్షించిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పేరు చెప్పుకుని కొందరు భూ సెటిల్ మెంట్లకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు విశాఖలో ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ తప్ప మరే ఆస్తి లేదని తెలిపారు.