ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం… కర్నూలు ఆసుపత్రిని?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా సమయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. [more]

Update: 2020-04-21 08:27 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా సమయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలంటే ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఏం చేయాలన్న దానిపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వివిధ వ్యాధులతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 600 మంది వరకూ చికిత్స పొందుతున్నారు. వారందరిని ప్రయివేటు ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించాలని నిర్ణయించారు. ప్రయివేటు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆరోగ్యశ్రీ వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తామని తెలపడంతో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అంగీకరించాయి. కర్నూలు లో కోవిడ్ ఆసపత్రికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.

Tags:    

Similar News