ట్విట్టర్, ఫేస్ బుక్ బాటలో అమెజాన్.. 10 వేల మంది ఉద్యోగులపై వేటు

అమెజాన్ డివైజెస్, సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ లింప్ పేరిట వెలువడిన ఈ అధికారిక ప్రకటనలో ప్రభావిత

Update: 2022-11-17 07:47 GMT

amazon layoffs 10 thousand employees

ఇటీవల ట్విట్టర్, ఫేస్ బుక్ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూ.. మెయిల్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్ కూడా అదే బాటలో వెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10 వేల మందిపై వేటు వేసింది. ఈ మేరకు వారందరికీ మెయిల్స్ పంపి.. 2 నెలల నోటీస్ పీరియడ్ ఇచ్చింది. తొలగింపు ప్రక్రియ బుధవారం ప్రారంభమవగా.. తాజాగా సంస్థ యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. అసాధారణ, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ సంస్థ శ్రామిక శక్తిని తగ్గిస్తున్నట్టు అమెజాన్ నోటిఫికేషన్ లో పేర్కొంది.

అమెజాన్ డివైజెస్, సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ లింప్ పేరిట వెలువడిన ఈ అధికారిక ప్రకటనలో ప్రభావిత ఉద్యోగుల తొలగింపుల గురించి కంపెనీ ఇప్పటికే తెలియజేసినట్టు వెల్లడించింది. వేటు ఎదుర్కొంటున్న ప్రతి ఉద్యోగితో మాట్లాడి, కొత్త ఉపాధి మార్గాలను అందించేందుకు సహాయం చేస్తామని వెల్లడించింది. వేటు ఎదుర్కొంటున్న ఉద్యోగులు అమెజాన్ లోనే ఇతర విభాగాల్లో ఉద్యోగం సంపాదించుకునేందుకు రెండునెలల సమయం ఇచ్చింది. అందులో విఫలమైతే.. విభజన చెల్లింపు, పరివర్తన ప్రయోజనాలు, బయట జాబ్ ప్లేస్ మెంట్ కు సహాయం అందించే ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చింది. గతవారం ఫేస్ బుక్ పేరెంట్ మెటా కూడా 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది.


Tags:    

Similar News