ఆదిలాబాద్ లో కాల్పుల కలకలం…ఎంఐఎం నేతే

ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ ఈ కాల్పులు జరిపారు. ఒక చిన్న వివాదంలో తలెత్తిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. [more]

Update: 2020-12-18 14:12 GMT

ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ ఈ కాల్పులు జరిపారు. ఒక చిన్న వివాదంలో తలెత్తిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గత ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు ఒకే పార్టీలో ఉన్నాయి. అయితే అప్పుడే విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. ఫరూక్ అహ్మద్ తనకున్న లైసెన్స్ డ్ రివాల్వర్ తో కాల్పులు జరిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స ను అందిస్తున్నారు. ఫారూక్ అహ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News