2024.. పూనకాలు లోడింగ్!

మరో 24 గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ ఏడాది మొదటి అర్థభాగంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఐదేళ్ల జగన్‌ పనితీరు, ప్రతిపక్షాల పోరాటంపై ఆంధ్రవాసులు తీర్పు ఇవ్వబోయే కాలమిది. రేవంత్‌కు పరిపాలనకు పరీక్షా కాలమిది. లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనుండటంతో 2024.. న్యూస్‌ ఛానళ్ళకు, పేపర్లకు చేతి నిండా పని ఇవ్వబోతోంది.

Update: 2023-12-31 03:06 GMT

2024.. పూనకాలు లోడింగ్!

మరో 24 గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ ఏడాది మొదటి అర్థభాగంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఐదేళ్ల జగన్‌ పనితీరు, ప్రతిపక్షాల పోరాటంపై ఆంధ్రవాసులు తీర్పు ఇవ్వబోయే కాలమిది. రేవంత్‌కు పరిపాలనకు పరీక్షా కాలమిది. లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనుండటంతో 2024.. న్యూస్‌ ఛానళ్ళకు, పేపర్లకు చేతి నిండా పని ఇవ్వబోతోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు ఈ ఏడాదిలో బయటపడబోతోంది. అలవిమాలిన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని నెరవేర్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. నాటి భారాస పనితీరుపై శ్వేతపత్రాలు, ప్రాజెక్టుల పరిశీలన అంటూ హడావుడి మొదలు పెట్టింది. ఓటమికి నాలుగు రోజులు కుంగిపోయినప్పటికీ, కేటీయార్‌ తన పోరాటాన్ని మొదలు పెట్టారు. ఇక ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ 2024లో చాలా ఎక్సయిటింగ్‌గా ఉండబోతోంది.

ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయమున్నా, గత ఆర్నెళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో యుద్ధ వాతావరణం మొదలైంది. 2023 ద్వితీయార్థంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయం రసకందాయంలో పడిరది. బెయిల్‌పై బయటకు వచ్చిన సైకిల్‌ పార్టీ అధ్యక్షుడు, జగన్‌ను ఓడిరచడానికి తన నలభై ఏళ్ళ అనుభవాన్ని సీరియస్‌గా వాడుకుంటున్నారు. 2024 ఎన్నికలు తనకు, తన పార్టీకి లైఫ్‌ అండ్‌ డెత్‌ సమస్య అనే విషయం ఆయనకు తెలుసు. వరుస సమావేశాలు, పొత్తులు, వాటిపై లీకులు, రెండు జాతీయ పార్టీలతో టచ్‌లో ఉండటం... ఇలా చంద్రబాబు తరహా పాలిటిక్స్‌తో న్యూస్‌ రూమ్‌లన్నీ బిజీగా మారిపోయాయి. తెలుగుదేశం పక్కనే నడుస్తామంటూ చెప్పిన పవన్‌ కళ్యాణ్‌, గేమ్‌లో తెలుగుదేశానికి ఆమడ దూరంలో, ఎక్కడో వెనుక‘బడి’ ఉన్నారు.

సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని చెబుతున్నా, జగన్‌ కూడా జాగ్రత్తగానే ఉంటున్నారు. గెలవరు అనే సందేహం ఉంటే... ఎలాంటి నాయకులనైనా పక్కన పెట్టేస్తున్నారు. 175 సీట్లు గెలుస్తామని చెబుతూ, 50 మంది వరకూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలు కూడా జగన్‌కు అత్యంత కీలకం. తన మూడు రాజధానుల కల, సంక్షేమం ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే 2024ను గట్టెక్కాల్సిందే.

కేంద్రంలో మోదీ హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇండియా బ్లాక్‌ అంటూ విపక్ష కూటమి పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తేలకపోవడం.. ఆ కూటమిలోని ’ఐక్యత‘ను చాటుతోంది. హిందుత్వ అజెండాతో, స్థిర ప్రభుత్వ నినాదంతో, డైనమిక్‌ రాజకీయంతో వెళ్తున్న మోదీ టీమ్‌ను ఎదుర్కోవడం... కప్పల తక్కెడ ఇండియా కూటమికి సాధ్యమేనా అనేది చూడాలి. మొత్తమ్మీద 2024 మాత్రం పూనకాలు లోడింగ్!

Tags:    

Similar News