అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి
అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు మరణించాడు. పోటీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు
అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు మరణించాడు. పోటీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్ నగర్ కు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ ను పోలీసులు కాల్చి చంపారని అతని తండ్రి తెలిపారు. అయతే నిజాముద్దీన్ ను పోలీసులు ఎందుకు కాల్చి చంపారో తెలియడం లేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతికి గల కారణాలను, ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చిందో తమకు తెలియజేయాలని విదేశాంగ మంత్రి జై శంకర్ కు తల్లిదండ్రులు లేఖ రాశారు.
కత్తి ఉండటంతో...
అలాగే మృతదేహాన్ని భారత్ కు తీసుకు వచ్చేందుకు సహకరించాలని కోరారు. నిజాముద్దీని్ 2016లో అమెరికాకు వెళ్లాడు. అయితే శాంటాక్లారా పోలీసులు అతనిని కాల్చి చంపినట్లు నిజాముద్దీన్ తల్లిదండ్రులకు సమాచారం అందింది. మృతదేహం శాంటా క్లారాలోని ఆసుపత్రిలో ఉందని తల్లిదండ్రులు తెలిపారు. అయితే తాను నివాసం ఉంటున్న ప్లాట్ ఓనర్ తో ఘర్షణ పడుతున్న సమయంలో నిజాముద్దీన్ ను పోలీసులు కాల్చి చంపినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అతని చేతులో కత్తి ఉండటంతో కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నట్లు తెలిసింది.