Revanth Reddy : మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ సమీక్ష
మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష చేశారు
మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష చేశారు. అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు లేకుండా చూడాలని, కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల కోసం పనిచేయాలని కోరారు. ప్రచారాన్ని కూడా ఉధృతం చేయాలని చెప్పారు.
ఈరోజు రాత్రికి...
దావోస్, యూఎస్ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం ఆయన మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి వచ్చిన తర్వాత వరసగా జిల్లాల పర్యటనలు చేయనున్నారు.