Medaram : నేటితో మేడారం మహా జాతర ముగింపు
నేటితో మేడారం మహా జాతర ముగియనుంది
నేటితో మేడారం మహా జాతర ముగియనుంది. కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. శుక్రవారం 50 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 28న ప్రారంభమైన జాతరకు నిన్నటి వరకు మొత్తం 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి.
మరో రెండేళ్ల తర్వాత...
మరో రెండేళ్ల తర్వాత ఈ మహాజాతర తిరిగి జరగనుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈరోజు గద్దెల మీద ఉన్న సమ్మక్క, సారలమ్మ లు తిరిగి వనాలకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత మూడు రోజుల నుంచి మేడారంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింద.ి