Telangana : హైదరాబాద్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు

Update: 2026-02-02 03:18 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్ పర్యటనకు గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. గత నెల 20వ తేదీన దావోస్ బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. నాలుగు రోజులు దావోస్ లో ఉండి వివిధ పరిశ్రమల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
అనంతరం అమెరికా బయలుదేరి వెళ్లారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిలో విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత నేడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ లతో జూమ్ మీటింగ్ లో పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఫారాలు అందచేత వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎల్లుండి నుంచి క మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాల పర్యటన చేయనున్నారు.


Tags:    

Similar News