సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్‌

సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఉన్నారని సమాచారం.

Update: 2026-01-31 04:15 GMT

సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఉన్నారని సమాచారం. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. తన ఆరోగ్య పరిస్థితి లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఫాంహౌస్‌లోనే విచారణ జరపాలని ఆయన కోరే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

హైకోర్టులో సవాల్...
సిట్ నోటీసుల్లోని సాంకేతిక అంశాలను లేదా సెక్షన్లను సవాలు చేసే అవకాశం ఉందని, విచారణపై స్టే ఇవ్వాలని లేదా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణను చేయాలని కోరినా, అందుకు అంగీకరించకుండా నందినగర్ నివాసంలోనే విచారిస్తామని చెప్పడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయంటున్నారు.


Tags:    

Similar News