KCR : నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేడు విచారించనున్నారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేడు విచారించనున్నారు. నందినగర్ లోని ఆయన నివాసంలో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. రెండోసారి విచారణకు రావాలంటూ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో నేడు విచారణ చేయనున్నారు. మరికాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు కేసీఆర్ బయలుదేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ ను సిట్ అధికారుల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించనున్నారు.ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి నందినగర్ వరకూ భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఈ మార్గం మొత్తం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం పదకొండు గంటలకల్లా కేసీఆర్ నందినగర్ కు చేరుకోనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో...
ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో విచారణ చేయాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా తనకు మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో మరొకతేదీన విచారించాలని కేసీఆర్ లేఖ ద్వారా కోరారు. అయితే తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటానని అక్కడే విచారణ చేయాలని కేసీఆర్ కోరారు. కానీ సిట్ అధికారులు మాత్రం విచారణను నందినగర్ లోనే విచారణ చేస్తామని, అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాశారు. నోటీసులపై స్పందించారు. తాను మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ తెలిపారు. తన ఇంటి గోడకు నోటీసులు అంటించడంపై కేసీఆర్ లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్త నిరసనలు...
సుప్రీంకోర్టుకు సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. కేసుకు సంబంధించి స్టేట్ మెంట్ రికార్డుకు పరిధిలుఅవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటానని చెప్పినా, తనను అక్కడే విచారించాలని కోరినప్పటికీ అందుకు సిట్ అంగీకరించకపోవడం శోచనీయమని తెలిపారు.చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదని తెలిపారు. తాను ప్రస్తుతం జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదని చెప్పినా సిట్ అధికారులు వినకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత రెండేళ్ల నుంచి తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నానని, అయినా చట్టాన్ని గౌరవించి తాను రేపు నందినగర్ నివాసానికి వచ్చి విచారణకు హాజరవుతానని తెలిపారు. మీరు వచ్చి తన స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకోవచ్చని తెలిపారు. మరొకవైపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. నేడు కేసీఆర్ విచారణకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చింది.