Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2026-01-31 05:55 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్ రూం ప్రాజెక్టులను ఇకపై టీజీహెచ్సీఎస్‌కు బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో ఉన్న ఈ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్...
ఇకపై తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోకి బదిలీ చేస్తూ రవాణా, రహదారులు, భవనాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాలను వేగవంతం చేసి, లబ్ధిదారులకు ఇళ్లను సకాలంలో అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పనుల్లో వేగం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News