మందు బాబులకు బ్యాడ్ న్యూస్
రేపు నగరంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు నిర్వాహకులు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి..
హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. రేపు నగరంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు నిర్వాహకులు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకూ ఈ శోభాయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలో పలు ఆంక్షలు విధించారు పోలీసులు.
హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా 24 గంటలపాటు మద్యం దుకాణాలను మూసివేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు కాంపౌండ్ లు మూసివేయాలని ఆయన స్పష్టం చేశారు.