Telangana : నేడు జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.

Update: 2025-12-09 04:10 GMT

నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. రోడ్లు భవనాలు శాఖ ఆద్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసింది. నేడు వర్చువల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ,మంత్రులు ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వర్చువల్ గా ముఖ్యమంత్రి...
అందుకోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కొరకు ఒక్కొక్కటి సుమారు 17.50 లక్షల వ్యయంతో మొత్తం 5 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఎత్తు 12 అడుగులు మరియు కింద ఉన్న దిమ్మె 6 అడుగులు మొత్తం కలిపి భూమి పై నుండి 18 అడుగులు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీకున తెలంగాణ తల్లి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయం తీసుకుంది


Tags:    

Similar News