Telangana : రేపు తెలంగాణలో మొదటి పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ లో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.
తెలంగాణ లో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పోలింగ్ కు సిద్ధం...
అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లుండగా, 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు, 201 ఇతర ఓటర్లున్నారని అధికారులు తెలిపారు. మొమొదటి విడత ఎన్నికలకు సంబంధించి 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ చేయనున్నారరు. మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.