Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు. రేపు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణంలో పలువురు పార్టీ నేతలను కలిసే అవకాశముంది. ఆయన ప్రయివేటు కార్యక్రమానికి కూడా హాజరవుతారని తెలిసింది.
పార్టీ నేతలతో పాటు...
ఢిల్లీలో తమ పార్టీ నేతలను కలసి గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల గురించి వివరించే అవకాశముంది. ఇదే సమయంలో రేపు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, మూసీ నది ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.