తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు
తెలంగాణలో అమర్ రాజా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టింది.
తెలంగాణలో అమర్ రాజా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ సిటీలో అతిపెద్ద పెట్టుబడి పెడుతున్నట్లు అమర్ రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు హైదరాబాద్ మంచి కేంద్రమని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ వనరులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు పెట్టుబడులకు అనుకూలిస్తాయని చెప్పారు.
తొమ్మిదివేల కోట్ల పెట్టుబడులతో...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు మంచి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అమర్ రాజా గ్రూపు తరుపున పెట్టుబడులు పెడతామని, కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద పెట్టుబడి అని గల్లా జయదేవ్ అన్నారు. తాను అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని గల్లా జయదేవ్ అన్నారు.