Telangana : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షకు పరీక్షకు మధ్య మూడు రోజులు గ్యాప్ ఉండేలా షెడ్యూల్ ను సిద్ధం చేశారు. విద్యార్థులు పరీక్షల వత్తిడి నుంచి బయటపడేందుకు ఈ గ్యాప్ ను ఉంచినట్లు అధికారులు తెలిపారు.
మూడు రోజులు గ్యాప్...
పదోతరగతి పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతారు. దీంతో పాటు పరీక్షకు... పరీక్షకు మధ్య మూడు రోజులు గ్యాప్ ఉంటే పరీక్షలకు బాగా సన్నద్ధులవుతారని తెలిపారు. వత్తిడి కూడా తగ్గుతుంది. అందుకోసమే విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని, ఈలోపు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేసి రివిజన్ స్టార్ట్ చేయాలని విద్యాశాఖ అధికారులు కోరారు.