Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ప్రభాకర్ రావు ను పలుమార్లు స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు విచారణ జరిపారు. కీలకమైన ఆధారాలను సేకరించారు. అయితే ఆయన కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ రద్దు పై..
బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడంతో నేడు దీనిపై విచారణ జరగనుంది. బెయిల్ పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయగలరని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించనున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు బెయిల్ రద్దుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.