Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

Update: 2025-12-10 04:15 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడ మండలంలో ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కారు బోల్తా పడటంతోఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంతో పాటు అతివేగమూ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఆదిలాబాద్ కు చెందిన వారిగా...
మృతులు ఆదిలాబాద్ జైజవాన్ నగర్, లక్ష్మీనగర్ వాసులుగా గుర్తించారు. మహారాష్ట్ర వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఒకరు గాయపడటంతో అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News