Telangana : అభివృద్ధి పథంలో తెలంగాణ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంంగా గవర్నర్ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. సైనిక వందనం స్వీకరించారు. తెలంగాణను త్రీ ట్రిలియన్ డాలర్ల కు తీసుకెళ్లేలా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని గవర్నర్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో తెలంగాణను ముందుకు తీసుకెళుతున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. మహిళ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
సంక్షేమం.. అభివృద్ధి....
మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా మాత్రమే కాకుండా తక్కువ ధరలకే సిలిండర్లను అందచేస్తున్నామని తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నియామకాలు చేపట్టామని, వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. నిరుపేదలకు ఇందిరమ్మ పేదలను మంజూరు చేస్తూ వారికి గృహ వసతిని కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే పారిశ్రామిక ప్రగతిని గణనీయంగా సాధించామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భారత్ ఫ్యూ చర్ సిటీలో ఇప్పటికే అనేక పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు. దావోస్ లోనూ పలు పరిశ్రమలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నామని జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం నిరంతరం సాగుతుందని అన్నారు.