ప్రిన్సిపల్ ఇంట్లో పనులు... విద్యార్థిని మృతి
బాన్సువాడ బోర్లం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి మరణించింది.
బాన్సువాడ బోర్లం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి మరణించింది. ప్రిన్సిపల్ ఇంటికి ఆటోలో పిల్లలు వెళుతుండగా ఆటోలో నుంచి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తన సొంత ఇంట్లో ఫంక్షన్ కు పిల్లలతో పనిచేయించుకునేందుకు పిల్లలను ఆటోలో ప్రిన్సిపల్ ఇంటికి తీసుకెళ్లారని, అయితే ఆటోలో నుంచి పడి పోవడంతో ఒక విద్యార్థిని మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
ఆటోలో నుంచి పడిపోయి...
ప్రిన్సిపల్ ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆటోలో నుంచి ముగ్గురు విద్యార్థినులు పడిపోగా అందులో ఒక విద్యార్థి మరణించింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులతో పాటు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా తమకు న్యాయం చేయాలని, బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.