సంతోష్ రావుకు సిట్ నోటీసులు
బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేపు మధ్య్యాహ్నం సంతోష్ రావును విచారించనున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో వరసగా సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.
రేపు విచారణకు రావాలని...
ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లను ఈ కేసులో విచారణ చేశారు. ఉదయం నుంచి రాత్రి ఆరు గంటల వరకూ వారిని విచారించారు. రేపు సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని బృందం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.