సౌమ్య చికిత్స కోసం పది లక్షల విడుదల

నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న కానిస్టేబుల్ సౌమ్య చికిత్స కోసం ప్రభుత్వం పది లక్షలు కేటాయించింది.

Update: 2026-01-26 08:05 GMT

నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న కానిస్టేబుల్ సౌమ్య చికిత్స కోసం ప్రభుత్వం పది లక్షలు కేటాయించింది. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి పట్టుకోవడానికి వెళ్లిన ఎక్సైజ్ బృందంపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నార. సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం సౌమ్యకు పది లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

గంజాయి స్మగ్లర్ల దాడిలో...
గంజాయి స్మగ్లర్లు వెళుతున్న కారును అడ్డుకోవడంతో వారు సౌమ్య పై నుంచి పోనిచ్చారు. దీంతో సౌమ్య కిడ్నీలతో పాటు పలు శరీరభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అత్యాధునిక చికిత్స అందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిమ్స్ కు వెళ్లి సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా గా ఉంటామని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News