విజయవాడ వెళుతుండగా బస్సు డ్రైవర్ కు గుండెపోటు
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగరాజుకు గుండెనొప్పితో మరణించారు
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నాగరాజుకు గుండెనొప్పితో మరణించారు. మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరిన హైదరాబాద్ - విజయవాడ బస్సు వెళుతుండగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వద్దకు రాగానే డ్రైవర్ నాగరాజుకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే బస్సును పక్కన ఆపి ప్రయివేటు వైద్య శాలకు వెళ్లారు.
చౌటుప్పల్ వద్దకు రాగానే...
అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలో బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న నాగరాజును పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించారని వెల్లడించారు. ఈ బస్సులో మొత్తం పద్దెనిమిది మంది ప్రయాణికులున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నప్పటికీ డ్రైవర్ నాగరాజు మరణించడం విషాదం నింపింది.