Telangana : తెలంగాణ శాసనసభలో రెండు కీలక బిల్లులు ఆమోదం
తెలంగాణ శాసనసభలో రెండు కీలక బిల్లులు ఆమోదం పొందాయి
తెలంగాణ శాసనసభలో రెండు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణలకు ప్రభుత్వం రూపొందించిన చట్టసవరణను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తెలియజేశారు. బీసీ రిజర్వేషన్లపై ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన సభలో ప్రభుత్వం తీర్మానం పెట్టింది.
బీసీ డిక్లరేషన్ పై...
సభలో అన్ని పార్టీల నేతలు చర్చించారు. తమ అభిప్రాయాలను సభ ముందు ఉంచారు. బీసీ డిక్లరేషన్ పై ఒకరోజు చర్చ పెట్టాలని బీఆర్ఎస్ కోరింది. అయితే ప్రజా సమస్యలపై తాము ఎన్ని రోజులయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార కాంగ్రెస్ ప్రకటించింది. తమ ప్రభుత్వం పారిపోవడం లేదని, ఇక్కడే ఉన్నామని, చర్చిద్దామని అధికార పార్టీ తెలిపారు. తెలంగాణ శాసనసభ సాయంత్రానికి వాయిదా పడింది.