Telangana: చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పదవీ కాలన్ని ఏడు నెలలు పొడిగించారు

Update: 2025-08-29 02:03 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పదవీ కాలన్ని ఏడు నెలలు పొడిగించారు. ఈ మేరకు కే్ంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ డీవోపీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది.

ఏడు నెలల పాటు...
అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఏడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News