స్పీకర్ నోటీసులు.. నేను పార్టీ మారలేదు

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన విషయంపై వివరణ ఇవ్వాలని కోరారు

Update: 2025-08-23 04:27 GMT

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన విషయంపై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఈ నోటీసులు అందాయి. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, పార్టీ మారలేదని తెలిపారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇస్తానని చెప్పారు.

పార్టీ మారలేదు...
తనకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని, స్పీకర్ ను కలసి వివరణ ఇస్తానని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అదే విషయాన్ని స్పీకర్ కు వివరిస్తానని తెలిపారు.


Tags:    

Similar News

.