Supreme Court : నేడు ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసు విచారణ
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసు విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసు విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. ఇప్పటికే ఈ కేసును విచారించిన న్యాయస్థానం స్పీకర్ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాదరావు వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అనర్హత పిటీషన్ ను తోసిపుచ్చారు.
స్పీకర్ నిర్ణయంపై....
దీంతో గత నాలుగు వారాల్లోగా కోర్టు థిక్కార పిటీషన్ పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశించడంతో నేడు విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ తరుపున న్యాయవాదులు కూడా స్పీకర్ నిర్ణయాన్ని ఈ విచారణ సందర్భంగా తప్పుపట్టే అవకాశముంది.