Telangana : నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసనలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేడు హైదరాబాద్ లో నిరసనలను తెలియజేయనుంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేడు హైదరాబాద్ లో నిరసనలను తెలియజేయనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్ప్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ పెద్దయెత్తున నిరసనలు తెలియజేయనుంది. రేపు జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేయనుంది. ఇటీవల మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది. ఈ పథకానికి వీబీ జీ రామ్ జీ పథకంగా పేరు మార్చింది.
జాతీయ హామీ ఉపాధి పథకం పేరును...
పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ పేరును మారుస్తూ బిల్లును ఆమోదించడంతో నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిరసనలను తెలియజేయాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. అందులో భాగంగా నేడు హైదరాబాద్ కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది.