చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-12-19 07:48 GMT

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి చిన్నారెడ్డి పనిచేశారని ఆయన ఆరోపించారు. అనేక గ్రామ పంచాయతీల్లో తన వర్గం వారిని కాంగ్రెస్ కు ఓటు వేయకుండా అడ్డుకున్నారని మేఘారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారంటూ మేఘారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్నారెడ్డి ఇన్ని కుట్రలు చేసినా...
చిన్నారెడ్డి ఇన్ని కుట్రలు చేసినా నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని మేఘారెడ్డి గుర్తు చేశారు. చిన్నారెడ్డి చేసిన పనిని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళతానని, క్రమశిక్షణా సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ లో ఇటువంటి వెన్నుపోటు దారులను ఉంచకూడదని మేఘారెడ్డి అభిప్రాయపడ్డారు. త్వరలో పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి ఆధారాలతో సహా చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి చెప్పారు.


Tags:    

Similar News

.