Telangana : కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారం లో కీలక పరిణామం
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారం లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారం లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పై చర్య లకు న్యాయ శాఖ సిఫార్సు చేసింది. మేడిగడ్డ రిపేర్లకు ఎల్ అండ్ టీ ఒప్పుకో కుంటే క్రిమినల్ కేసు పెట్టాలని న్యాయశాఖ లీగల్ ఒపీనియన్ ఇచ్చింది. సొంత నిధులతో బ్యారేజ్ నిర్మాణం చేపట్టక పోతే క్రిమినల్ కేసులు పెట్టాలని న్యాయ శాఖ సూచన చేసింది.
కంపెనీలకు నోటీసులు...
మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ , అన్నారం నిర్మాణ సంస్థ ఆప్కాన్స్, సుందిల్ల నిర్మాణ సంస్థ నవయుగ కు విజిలెన్స్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు స్పందించకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విషయంలో నవయుగ, ఆప్కాన్స్, ఎల్ అండ్ టిలు నిర్మాణ సంస్థ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.