KCR : హైకోర్టులో కేసీఆర్ కు ఊరట
హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊరట దక్కింది.
హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణ నివేదిక ఆధారంగా చర్యలకు తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ గడువు జనవరి వరకు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌లపై చర్యలు తీసుకోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుపడిన హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జనవరి 2026 వరకు పొడిగించింది.
జనవరి కి వాయిదా...
బుధవారం ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్‌సింగ్, న్యాయమూర్తి జీ.ఎం. మోయిద్దీన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కౌంటర్ అఫిడవిట్లు సమర్పించేందుకు మరికొంత సమయం కోరగా, కోర్టు ఆమోదించింది. తదుపరి విచారణ జనవరి నెలకు వాయిదా వేస్తూ, కేసీఆర్, హరీశ్‌రావు, జోషి, సబర్వాల్‌లకు ఇంతకుముందు ఇచ్చిన రక్షణ ఆదేశాలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరిన విషయం తెలిసిందే.